పురాణాల ప్రకారం ఏకాదశికిచాలా విశిష్టత ఉంది. పంచాంగం ప్రకారం నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. మాఘమాసం కృష్టపక్షంలో అంటే మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) విజయ ఏకాదశి ఫిబ్రవరి 13 న వచ్చింది. పండితులు తెలిపిన వివరాలప్రకారం ఆరోజు కొన్ని పరిహారాలు పాటిస్తే ఉద్యోగ సమస్యలతో పాటు అప్పుల బాధలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. ఈ స్టోరీలో ఆ వివరాలు తెలుసుకుందాం. . .
హిందూ ధర్మంలో మాఘమాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనినే ‘విజయ ఏకాదశి’ అని పిలుస్తారు. పేరుకు తగినట్లుగానే, ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ప్రతి రంగంలో విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం విజయ ఏకాదశిని ఫిబ్రవరి 13న జరుపుకోనున్నారు. విజయ ఏకాదశి వ్రతం శ్రద్ధతో ఆచరిస్తే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఉద్యోగ సమస్యలతో పాటు అప్పుల బాధలకు విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.
సీతారాముల పూజ: విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడిని, సీతాదేవిని కలిపి పూజించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి, సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి విజయ ఏకాదశి రోజున స్వామివారికి 11 అరటిపండ్లు, 11 లడ్డూలు లతో పాటు ఎర్రటి పుష్పాలను సమర్పించండి.
సూర్య భగవానుడికి అర్ఘ్యం: రాగి పాత్రలో శుద్ధమైన నీరు లేదా గంగాజలంలో 11 ఎర్ర మిరప గింజలు వేసి సూర్యదేవుడికి అర్ఘ్యం వదలండి. అర్ఘ్యం అంటే సూర్యభగవానుడి ఎదురుగా నిలబడి దోసెలతో నీటిని తీసుకొని ఆదిత్య హృదయం.. లేదా సూర్యాష్టకం చదువుతూ.. సూర్యునికి చూపించి.. రాగి పళ్లెంలో వదలాలి. ఇలా ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, తేజస్సును పెంచుతుంది. ఇలా చేయడం వలన అనుకున్న పనులు నెరవేరడంతో పాటు.. అప్పుల సమస్యలకు పరిష్కారం కలుగుతుందని పండితులు అంటున్నారు.
►ALSO READ | ఏడుపు మీ ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా ? కన్నీళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ఉద్యోగంలో విజయం కోసం: ఒక కలశంపై మామిడి ఆకులు ఉంచి, దానిని బార్లీతో నింపండి. దానిపై దీపం వెలిగించి, లక్ష్మీనారాయణులకు 11 రకాల పండ్లు, పూలు సమర్పించి మీ లక్ష్యం నెరవేరాలని ప్రార్థించండి. పూలు, పండ్లలో పసుపు రంగువి ఉండేలా చూసుకోండి.
అప్పుల విముక్తి కోసం: అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు విజయ ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేసి, దాని వేర్ల దగ్గర నీటిని సమర్పించాలి.
తులసి కోట వద్ద దీపారాధన: సాయంత్రం వేళ తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ప్రదక్షిణ చేయడం ద్వారా మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
రాత్రి జాగరణ: పురాణాల ప్రకారం, ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు. భజన కీర్తనలతో జాగరణ చేయడం వల్ల శత్రువుల ప్రభావం తగ్గి, ప్రతికూల శక్తులు నశిస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
